Teenmar Mallanna : ఎవరి ముందు మోకరిల్లను.. షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మల్లన్న
ప్రధానాంశాలు:
Teenmar Mallanna : ఎవరి ముందు మోకరిల్లను.. షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల సర్వే కాపీలను తగలబెట్టి, పార్టీ నాయకత్వంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు Telangana Congress తెలంగాణ కాంగ్రెస్ గురువారం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మే 12 లోపు తన సమాధానం ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్సీని ఆదేశించింది. “ఫిబ్రవరి 12, 2025 న లేదా అంతకు ముందు మీ వివరణను తెలియజేయాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం బలమైన చర్యలు తీసుకుంటారు” అని నోటీసులో పేర్కొన్నారు.
షోకాజ్ నోటీసు జారీపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కుల గణనలో ఉన్న వాళ్లకే షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. chintapandu naveen వాస్తవానికి తీన్మార్ మల్లన్న వాళ్ల లక్ష్యం కాదన్నారు. మల్లన్న సృష్టిస్తున్న బీసీ నినాదం వాళ్ల టార్గెట్ అని పేర్కొన్నారు. బీసీలను తగ్గించడం వాళ్ల ఉద్దేశ్యం అయినప్పుడు బీసీలను అధికారం దాకా రాణిస్తారా అని ఆయన ప్రశ్నించారు. బీసీలను అణిచి వేసి, వాళ్ల గొంతు లేవద్దనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు. కానీ అవేవి కుదరవు, ఆ పప్పులేవి ఉడకవన్నారు.
![Teenmar Mallanna ఎవరి ముందు మోకరిల్లను షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మల్లన్న](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Teenmar-Mallanna.jpg)
Teenmar Mallanna : ఎవరి ముందు మోకరిల్లను.. షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మల్లన్న
రాహుల్ గాంధీ బీసీలు మేలుకో అని చెప్పిండు
తమ నాయకుడు రాహుల్ గాంధీ Rahul Gandhi బీసీలు మేలుకో అని చెప్పిండని తెలిపారు. ఆ పదం ఆదారంగా ఆయన పార్లమెంట్‌లో చెప్పినటువంటి మాటల ఆదర్శంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ కులాలు ఒక్కటి అయి, తమ వాటా ఏదని ప్రశ్నిస్తున్న తరుణంలో బీసీల మీద దెబ్బకొంటే విధంగా ఈ నివేదిక తీసుకువచ్చినట్లు ఆయన దుయ్యబట్టారు. బీసీ ప్రజల కంటే ఈ షోకాజ్ నోటీసు పెద్దది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలను BC దూరం చేస్తున్నటువంటి దొంగలు, ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు.ఇది బీసీల ఉద్యమాన్ని అణచడానికి, వారి హక్కుల కోసం పోరాడితే ఇచ్చిన నోటీసు. అందుకే బీసీ సమాజం నన్ను రిప్లయి ఇవ్వమంటే నేను ఇస్తా. కాని తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎవరి ముందు మోకరిల్లడు. ఇది ఫైనల్ అని పేర్కొన్నారు.