Teenmar Mallanna : నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న
ప్రధానాంశాలు:
Teenmar Mallanna : నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna : తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్ నుంచి పంపిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావించారు. కానీ అది ఎన్నటికి జరుగదన్నారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదన్నారు.

Teenmar Mallanna : నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు : తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునేందుకే
కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని భావించాం. రాహుల్ గాంధీ తలెత్తుకుని తిరుగాలని ఆశించాం. కానీ కులగణన తప్పుల తడక. తాను మాట్లాడింది తప్పు అయితే కుల గణనకు మళ్లీ సమయం ఎందుకు పొడిగించారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ సర్వేపై ముఖ్యమంత్రికే చిత్తశుద్ది లేదన్నారు. ఆయనే సర్వేలో ఆఖర్లో పాల్గొన్నట్లు చెప్పారు. సర్వేలో అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించారన్నారు. కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ సర్వేను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. సర్వే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వస్తే సర్వే తప్పుల తడక అని తాను నిరూపిస్తానంటూ మల్లన్న సవాల్ విసిరారు.
2028లో బీసీ ముఖ్యమంత్రే మా లక్ష్యం
రాహుల్ గాంధీ పిలుపు మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఏదైనా పనిచేస్తే తరతరాలు గుర్తించుకోవాలన్నారు. కానీ సీఎం పేరు క్యాబినెట్ మంత్రులకు కూడా గుర్తుండటం లేదంటూ ఎద్దేవ చేశారు. 2011లో రాహుల్ గాంధీ చేసిందే తాను చేసినట్లు చెప్పారు. అన్యాయం జరిగితే గొంతెత్తాలని రాహుల్ చెబుతుంటే మీరంతా చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను కూడా కారణమన్నారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి అనేది తమ లక్ష్యం అని వెల్లడించారు. బీసీ వాదాన్ని రేపటి నుంచి గ్రామగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.