MLA Vemula Veeresham : ఎమ్మెల్యే వీరేశంకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ ?
ప్రధానాంశాలు:
MLA Vemula Veeresanm : ఎమ్మెల్యే వీరేశంకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ ?
MLA Vemula Veeresam : సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ ఓటీపీ, మహిళలతో న్యూడ్ కాల్స్ తో సహా అనేక రూపాల్లో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఎమ్మెల్యేకు న్యూడ్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు పంపాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డారు.

MLA Vemula Veeresham : ఎమ్మెల్యే వీరేశంకు బెదిరింపులు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ ?
ఎమ్మెల్యే పట్టించుకోకపోయేసరికి ఆయన కాంటాక్ట్‌లోని నంబర్లకు ఆ వీడియోను పంపిచారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్‌లను ఎవరితోనూ పంచుకోకూడదన్నారు.
అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు తెలియజేయాలన్నారు. అప్రమత్తతోనే సైబర్ నేరాల బారిన పడకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు.