Caste Resolution : కుల గణన సర్వేకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..!
ప్రధానాంశాలు:
Caste Resolution : కుల గణన సర్వేకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..!
Caste Resolution : తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ఇటీవల చేపట్టిన కుల గణన సర్వే ను నేడు కేబిఎట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. కులగణన నివేదికకు ప్రవేశ పెట్టేందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయగా కేబినెట్ ఆమోదం తెలిపిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఐతే ఈ నివేదికపై సభా సభ్యులు కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఐతే వారికి మంత్రులతో పాటు సీఎం కూడా వారి అనుమానాలకు వివరణ ఇచ్చారు.
నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చివరగా సామాజిక, ఆర్ధిక, కుల గణన సర్వే తీర్మానానికి ఆమోదం తెలపాలని సభలో పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీలో సామాజిక, ఆర్ధిక, కుల గణ సర్వే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఇక మీదట కులగణన వివరాలు అధికారిక లెక్కలుగా ఉంచబడతాయి. ఈ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తం కుమార్ అన్నారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ నివేదిక గురించి కూడా సీఎం రేవంత్ ప్రస్తావిచారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సుప్రీం కోర్టు తీర్పుని అమలు చేస్తామని అనారు సీఎం. Telangana Aseembly, Social Economic and Caste Resolution, CM Revanth Reddy