BC Reservation Bill : తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదించాలి
ప్రధానాంశాలు:
BC Reservation Bill : తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదించాలి
BC Reservation Bill : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అమోధించిన అనంతరం ఆ బిల్లను చట్ట ఆమోదం కోరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పంపగా దానిని పార్లమెంట్ లోని ఉభయ సభల ఆమోదం కొరకు పంపబడిందని పెండింగ్ లో ఉన్న ఆ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆమోద చట్టం చేసి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టం అమలయ్యే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గల సబ్ – కలెక్టర్ కార్యాలయం ముందు బిసి హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన..
BC Reservation Bill : తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదించాలి
BC Reservation Bill : బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు
ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 103వ,రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్లో బిల్లు తెచ్చి రిజర్వేషన్ అమలు చేస్తున్న విధంగానే 2025లో దేశవ్యాప్తంగా కుల గణన చేసి ఆయా జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం విద్యా,ఉద్యోగ చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కమిషన్ ఏర్పాటు చేయాలని,అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రెండు లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించాలని తెలియజేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా బీసీలకు,దళితులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలను కేటాయించాలని అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని,విద్యా హక్కు చట్టం ప్రకారం బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ వర్గాల పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందుబాటులోకి తేవాలని అలాగే కార్పొరేట్ పాఠశాల మరియు కళాశాల యూనివర్సిటీలలో వీరందరికీ కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజులు చెల్లించే విధంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని,బీసీల ఆర్థిక అభివృద్ధికి చేతి వృత్తుల వారికి చిన్న మధ్య తరహా పరిశ్రమ నెలకొల్పడానికి చిరు మధ్య తరహా వ్యాపారులకు వెంటనే ఐదు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని ఇందుకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ ధర్నాకు సంబంధించిన అంశాలతో కూడిన పత్రాన్ని సంబంధిత కార్యాలయ సిబ్బందికి అందజేయడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్y బంటు వెంకటేశ్వర్లు,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు చేగొండి మురళి యాదవ్,జిల్లా అధ్యక్షుడు చిలక రాజు,శ్రీను,అమరారపు పున్నయ్య,తాళ్ల వెంకన్న, పరికె భరత్,శీను,సత్యం, సూరయ్య నాగేశ్వరరావు,సాంబశివరావు,కృష్ణమూర్తి,జయప్రతాప్ తోపాటుగా తదితరులు పాల్గొన్నారు.