Telangana Budget : తెలంగాణ బడ్జెట్ ఏ ఏ శాఖకు ఎంత కేటాయించిందంటే..!
ప్రధానాంశాలు:
Telangana Budget : తెలంగాణ బడ్జెట్ ఏ ఏ శాఖకు ఎంత కేటాయించిందంటే..!
Telangana Budget : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేలా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్య, నీటి పారుదల, పురపాలక అభివృద్ధి, విద్యుత్ రంగాలకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించడం గమనార్హం.

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ ఏ ఏ శాఖకు ఎంత కేటాయించిందంటే..!
Telangana Budget తెలంగాణ బడ్జెట్ శాఖలవారీగా కేటాయింపులు
ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా సంక్షేమ రంగానికి భారీగా నిధులను కేటాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు కేటాయించారు. అలాగే మైనారిటీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు, చేనేత రంగానికి రూ.371 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన, పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా ఆరు గ్యారంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించడంతో పాటు, రైతు భరోసా, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలకు పెద్దపీట వేసింది.
ప్రత్యేకంగా వ్యవసాయ, విద్య, వైద్య రంగాలను ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి రూ.24,439 కోట్లు, విద్యా రంగానికి రూ.23,108 కోట్లు, వైద్యానికి రూ.12,393 కోట్లు కేటాయించి ఈ రంగాల్లో మరింత అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా కింద రూ.18,000 కోట్లు కేటాయించడంతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ కింద రూ.1,800 కోట్లు మంజూరు చేసింది. ఉచిత విద్యుత్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ రాయితీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలుకు భారీ నిధులు కేటాయించడంతో ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మొత్తం మీద, ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా, సంక్షేమాన్ని మరింత పెంచేలా ఉండడం విశేషం.