Sankranti Rythu Bharosa : సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేత.. విధి విధానాలపై తెలంగాణ కేబినెట్ కమిటీ కసరత్తు…!
ప్రధానాంశాలు:
Sankranti Rythu Bharosa : సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేత.. విధి విధానాలపై తెలంగాణ కేబినెట్ కమిటీ కసరత్తు...!
Sankranti Rythu Bharosa : రైతు భరోసా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క mallu bhatti vikramarka అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్‌కమిటీ గంటన్నరపాటు చర్చించింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేసినట్లుగా సమాచారం. అయితే విధివిధానాలను నిర్ణయించేందుకు మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది.

Sankranti Rythu Bharosa : సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేత.. విధి విధానాలపై తెలంగాణ కేబినెట్ కమిటీ కసరత్తు…!
కేబినెట్ సబ్ కమిటీలో సాగు భూమికి రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వాలనే చర్చ జరిగింది. అయితే ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. ఈ క్రమంలోనే.. మరోసారి సమావేశమై రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్‌కమిటీ డిసైడ్ అయింది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతు భరోసా అమలు తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు.
కాగా టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై ఫోకస్ పెట్టింది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తున్నట్లు సమాచారం. rythu bharosa, Telangana Cabinet Committee, Telangana,