Telangana : తెలంగాణ కేబినేట్ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే
Telangana : తెలంగాణ కేబినేట్ ఇవాళ సుదీర్ఘంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ముఖ్యమైన వాటిలో ఒకటి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.. రెండోది విద్యావ్యవస్థపై చర్చించారు.

telangana cabinet meeting decisions over education system
విద్యావ్యవస్థపై ఫీజుల నియంత్రణ కోసం.. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం విధివిధానాలు రూపొందించేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షులుగా ఉంటారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, తలసాని, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ, ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, ఎర్రబెల్లి సభ్యులుగా ఉంటారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం భోదనకై తెలంగాణ కేబినేట్ నిర్ణయం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయం
ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం.
పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7289 కోట్లతో మన ఊరు మన బడి
ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్