Telangana : గుడ్ న్యూస్.. ఆ వర్గానికి పెద్ద పీఠం వేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : గుడ్ న్యూస్.. ఆ వర్గానికి పెద్ద పీఠం వేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana : గుడ్ న్యూస్.. ఆ వర్గానికి పెద్ద పీఠం వేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి rajiv yuva vikasam scheme రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. లక్షలాది యువత ఈ పథకానికి దరఖాస్తు చేయగా, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి 44,800 దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఈ పథకానికి అన్వయించనున్నట్లు ప్రభుత్వం కీలకంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం, ఈ పథకంలో మూడు ఉపకులాలకు 1%, 9%, 5% రిజర్వేషన్లతో లబ్ధి కల్పించనున్నారు.

Telangana గుడ్ న్యూస్ ఆ వర్గానికి పెద్ద పీఠం వేస్తున్న రాజీవ్ యువ వికాసం

Telangana : గుడ్ న్యూస్.. ఆ వర్గానికి పెద్ద పీఠం వేస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’

Telangana : ఎస్సీ సామాజిక వర్గానికి మరింత మేలు చేయబోతున్న ‘రాజీవ్ యువ వికాసం’

ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.6,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు పత్రాలను అందించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సిబిల్ స్కోర్ పేరు మీద అవగాహన లేని ప్రచారం జరుగుతుందని, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికంటే కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లేలా ప్రోత్సహించనున్నారు.

పథకానికి సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్‌ను ఈ నెల 15 నుండి 25 వరకు పూర్తిచేసి, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు ట్రైనింగ్ నిర్వహించి, యూనిట్ల గ్రౌండింగ్ కూడా చేపట్టనున్నారు. పథకం అమలుపై సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఇందులో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కాకున్నా ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన మార్గంగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది