TG Liquor Prices : మందు బాబులకి కోలుకోలేని వార్త.. కీలక నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం..!
TG Liquor Prices : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అప్పులు భారీగా పెరుగుతూ పోతున్నాయి. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేయగా,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఆదాయం పెంచుకునే పనిలో రాష్ట్ర సర్కార్ ఉంది. ఇందులో భాగంగా మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్‌శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో లిక్కర్ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క […]
ప్రధానాంశాలు:
TG Liquor Prices : మందు బాబులకి కోలుకోలేని వార్త.. కీలక నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం..!
TG Liquor Prices : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అప్పులు భారీగా పెరుగుతూ పోతున్నాయి. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేయగా,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఆదాయం పెంచుకునే పనిలో రాష్ట్ర సర్కార్ ఉంది. ఇందులో భాగంగా మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్‌శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో లిక్కర్ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
TG Liquor Prices మద్యానికి రెక్కలు..
బీరుపై రూ. 15 నుంచి రూ. 20, క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ. 10 నుంచి రూ. 80 వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సగటున 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని సర్కార్ చూస్తున్నట్లు సమాచారం. అయితే, మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తెలంగాణలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ ధరలకు తగ్గట్లుగా తెలంగాణలోని లిక్కర్ ధరల్లో మార్పులు చేయాలనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. లిక్కర్ ధరలను సగటున 20-25 శాతం మేర పెంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ మీద లిక్కర్ రేట్లు పెంచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదేపనిచేస్తుందని కూడా అపోసిషన్ పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు