New Ration Card : కొత్తగా రేషన్ కార్డు దారులకు ప్రభుతం శుభవార్త.. వెంటనే అప్లై చేసుకోండి..!
ప్రధానాంశాలు:
New Ration Card : కొత్తగా రేషన్ కార్డు దారులకు ప్రభుతం శుభవార్త.. వెంటనే అప్లై చేసుకోండి..!
New Ration Card : తెలంగాణాలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకు ప్రయ్త్నిస్తుంది. ఇప్పటికే వారు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేస్తుండగా మరికొన్ని పథకాలు కూడా త్వరలోనే ప్రవేశ పెట్టబోతున్నారు. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ విధానం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు దానితో పాటు అదనంగా ఒక కొత్త కార్డ్ కూడా ఇస్తారని తెలుస్తుంది.
తెలంగాణాలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ మొత్తానికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల కోస అక్టోబన్ర్ ఫస్ట్ వీక్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలుస్తుంది. దీనికి అర్హులమని భావించే ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఇంటింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తామని
సీఎం రేవంత్ రెడి అన్నారు. దాని వల్ల ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేలా అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ హెల్త్ కార్డ్ జారీకి దుర్గాబాయి దేశ్ ముక్ లాని హాస్పిటల్లు, ఎన్ జి ఓ లు సహకారం తీసుకుంటామని అన్నారు.
New Ration Card డిజిటల్ హెల్త్ కార్డ్ ఉపయోగాలు..
ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ తో ఏ హాస్పిటల్ కు వెళ్లినా సరే కార్డ్ స్కాన్ చేయగానే వ్యక్తి ఆరోగ్య, అనారోగ్యూ వివరాలన్నీ అందులో తెలుస్తాయి. దీని వల్ల వైద్యం చేయడం సులభం అవుతుందని అన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ వల్ల ఆరోగ్య పరీక్ష చేసిన తర్వాతనే వివరాలు నమోదు చేసుకుంటారు. అత్యవసర సమయాల్లో ఈ హెల్త్ కార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు చికిత్స ఈజీ అవుతుందని చెబుతున్నారు.
ప్రత్యేక ప్రయోజనాల కారణంగానే గవర్మెంట్ ఈ కార్డులను జారీ చేస్తుందని తెలుస్తుంది. ఐతే వీటికి అర్హులు ఎవరన్నది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు అక్టోబర్ మొదటి వారం లో గైడ్ లైన్స్ విడల చేస్తారని తెలుస్తుంది.