RS 5 Tiffin : ఏంటి.. హైదరాబాద్‌లో రూ.5కే టిఫినా.. మెనూ ఏంటంటే..!
RS 5 Tiffin : హైదరాబాద్‌లో అన్నపూర్ణ కేంద్రాలకి ఎంతటి రెస్పాన్స్ వస్తుందో మనం చూస్తున్నాం. ఎప్పటినుండో రూ.5 కే భోజనాన్ని అందిస్తుండగా, చాలా మంది అక్కడికి వచ్చి ఆరగిస్తున్నారు. పేదవాళ్లే కాదు మధ్య తరగతి వాళ్లు కూడా అక్కడ ఆరగిస్తూనే ఉన్నారు. అన్నపూర్ణ కేంద్రాలలో మధ్యాహ్నాం భోజన పథకానికి మంచి ఆదరణ లభిస్తుండగా, ఇప్పుడు టిఫిన్ కూడా అందించాలని అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తోన్న హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఇప్పుడు చర్చలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.
RS 5 Tiffin మంచి నిర్ణయం..
టిఫిన్‌ని కూడా త్వరలో తీసుకురావాలని భావిస్తుండగా, మెనూపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మెనూలో ఉప్మా, టమాటా బాత్, ఇడ్లీ, వడ వంటివి చేర్చుతారని అటున్నారు. వాటి ధర రూ.5లే ఉంటుందని అంటున్నారు. ఇక టిఫిన్‌కి మిగతా ఖర్చు మొత్తం జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుంది. త్వరలోనే టిఫిన్‌కు సంబంధించి స్పష్టత రానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 373 అన్నపూర్ణ కేంద్రాలు ఉండగా, కొన్ని పాడైపోయాయి.ఒక 53 కేంద్రాలు మూత పడడం జరిగింది. ఇప్పుడు అయితే కేవలం 320 మాత్రం కొనసాగుతున్నాయి.. ఆ కేంద్రాల ద్వారా జీహెచ్ఎంసీ రోజుకి దాదాపు 40 వేలకి పైగా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు.
మొత్తం ఒక్కరికి భోజనం ఖ్చు 28 రూపాయలు అవుతుండగా, ఇందులో జీహెచ్ ఎంసీ రూ.23రు భరిస్తుంది. మనకు ఐదు రూపాయలకి ఇస్తుంది. హరేకృష్ణ ఫౌండేషన్‌కు ఒక్కో భోజనానికి రూ.28 చెల్లిస్తోంది. కరోనా సమయంలో ఫోన్ చేస్తే ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆహారం ఇవ్వడంతో పాటూ శిబిరాల్లో ఉండే కార్మికులకు కూడా భోజనం అందించారు. అయితే ఇప్పుడు మరి కొన్ని కేంద్రాలని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డబ్బాల కోసం టెండర్ ని ఆహ్వానిస్తుండగా, ఒక్కో డబ్బా ఏర్పాటుకు జీఎస్టీ కాకుండా రూ.4.50 లక్షల నుంచి రూ.4.70 లక్షల వరకు ఖర్చవుతుంది అంటున్నాయి ఏజెన్సీలు. తక్కువ ధరలో ఎవరైన వాటిని ఇస్తే వాటి నాణ్యత, తదితర అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రాసెస్ చేయాలని చూస్తున్నారు.