Telangana Govt : తెలంగాణ మహిళలకి ఒకేసారి మూడు వరాలు.. గుడ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
ప్రధానాంశాలు:
Telangana Govt : తెలంగాణ మహిళలకి ఒకేసారి మూడు వరాలు.. గుడ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
Telangana Govt : తెలంగాణ Telangana ప్రభుత్వం Women మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు ఎన్నో పథకాలని అమలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఈషా ప్రైవేట్ హాస్పిటల్‌ను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Telangana Govt : తెలంగాణ మహిళలకి ఒకేసారి మూడు వరాలు.. గుడ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
Telangana Govt మంచి అవకాశం..
మహిళలు మీ సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, డైరీ ఫామ్‌లు, సోలార్ లైట్స్ వ్యాపారాలు, పౌల్ట్రీ ఫారాల్లో రాణించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. 60 లక్షల పాఠశాల యూనిఫామ్‌లను మహిళా సంఘాల ద్వారా కుట్టించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలతో పాటు వడ్డీ లేని రుణ సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందించనుందని సీతక్క పేర్కొన్నారు.
కొత్త వ్యాపారాల్లోకి మహిళలు ప్రవేశించాలంటే.. ముందుగా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ అధికారులను కలవాలి. తాము ఎలాంటి వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నదీ చెప్పాలి. అప్పుడు వారి ఆ వ్యాపారం చెయ్యడానికి ఎంత ఖర్చవుతుంది? మహిళా సంఘం వారు ఎంత డబ్బు పెట్టాలి, బ్యాంక్ ద్వారా ఎంత రుణం వస్తుంది? ఆ రుణాన్ని ఎన్ని సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి? ఇలా అన్ని విషయాలూ చెబుతారు. ప్రతీదీ సెర్ప్ ద్వారా త్వరగా జరుగుతుంది.