Telangana Govt : గొప్ప శుభవార్త.. రేషన్ బియ్యం లో మార్పులు.. ఒకొక్కరికి 6 కిలోల సన్న బియ్యం..!
ప్రధానాంశాలు:
Telangana Govt : గొప్ప శుభవార్త.. రేషన్ బియ్యం లో మార్పులు.. ఒకొక్కరికి 6 కిలోల సన్న బియ్యం
Telangana Govt : తెలంగాణా ప్రభుత్వం పథకాల అమల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్ ద్వార ప్రజలకు అందాల్సిన బియ్యం పక్క దారి పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొందరు దొడ్డు బియ్యం తీసుకున్నా వాటిని తినకుండా అమ్మేస్తున్నారని గుర్తించారు. అందుకే అవి మళ్లీ రైస్ మిల్లులకే చేరుతున్నాయి లేదా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మిల్లర్ల రీసైక్లింక్ కు చెక్ పెట్టేలా నిర్ణయాలను తీసుకుంటుంది. దీని ప్రకారం రేషన్ కార్డ్ ద్వారా సన్నబియ్యమే పంపిణి చేసేలా నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి దీన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. అంతేకాదు రేషన్ కార్డ్ ఉన్న వారికి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తామని అన్నారు.
Telangana Govt రేషన్ ద్వారా 6 కిలోల బియ్యం..
ఇదివరకు రేషన్ ద్వారా ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చే వారు. కానీ ఇప్పుడు దాన్ని 6 కిలోలు చేస్తున్నారు. అంతేకాదు డిజిటల్ కార్డ్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ఆరికి బియ్యం అందిస్తున్నారు. ఐతే ఆధ్రాలో బియ్యంతో పాటు గోధుమలు ఇంకా 9 రకాల సరుకులు ఇస్తున్నారు. ఏపీ లానే తెలంగాణాలో కూఆ రేషన్ కార్డ్ దారులకు మిగతా సరుకులు ఇవ్వాలని భావిస్తున్నారు.
ఫ్యామిలీ కార్డ్ తో మరిన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్డ్ ఆధారంగానే పథకాల అర్హులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతుంది. రేషన్ కార్డ్ ఉన్న వారికే అన్నట్టుగా కాకుండా డిజిటల్ కార్డ్ జారీ చేయడం లో పారదర్శకత చూపిస్తున్నామని అన్నారు.