Volunteer Jobs : వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ సర్కార్ సమీక్ష… త్వరలోనే అమలు…!
ప్రధానాంశాలు:
Volunteer Jobs : వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ సర్కార్ సమీక్ష... త్వరలోనే అమలు...!
Volunteer Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ వాలంటీర్లను ఉపయోగించి గ్రామస్థాయిలో ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ను నియమించి వారి ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తూ వచ్చారు. ఇక ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక దీనిలో భాగంగా వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న వారికి గౌరవ వేతనం ప్రతినెల రూ.5000 ప్రభుత్వం అందిస్తూ వచ్చింది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రశంసలు అందుకోవడంతో ఇతర రాష్ట్రాల కన్ను కూడా ఈ వాలంటీర్ వ్యవస్థపై పడిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థ మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన వారిని నియమించడం జరిగింది. అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల గౌరవ వేతనం రూ.750 పెంచి రూ.5750 అందిస్తున్నారు. అంతేకాక ఏపీ లో ఈ ఇవాలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థ పై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గ్రామీణ ప్రాంతాలలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Volunteer Jobs : వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ సర్కార్ సమీక్ష… త్వరలోనే అమలు…!
దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 34,694 మంది వాలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వాలంటీర్ల వ్యవస్థపై అధికారులు ప్రసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి అనంతరం ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ నియామకాలపై స్పష్టత ఇవ్వనున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఎలాంటి విద్యార్హత ఉంటుంది…?ఎంత వేతనం ఇస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.