Telangana Lok Sabha Election Schedule : తెలంగాణ‌ లోక్ స‌భ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది… పోలింగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Lok Sabha Election Schedule : తెలంగాణ‌ లోక్ స‌భ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది… పోలింగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,5:20 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Lok Sabha Election Schedule : తెలంగాణ‌ లోక్ స‌భ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది... పోలింగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

Telangana Lok Sabha Election Schedule : ఇటీవ‌ల తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి కాగా,కాంగ్రెస్ మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల న‌గారా ఎప్పుడు మోగుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ తేదీల‌ని ప్ర‌క‌టించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండ‌గా, నాలుగో విడుత‌లో మ‌న ద‌గ్గ‌ర జ‌ర‌గ‌నున్నాయి. మే 13వ తేదీన తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుండ‌గా, జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో తెలియ‌జేశారు. అయితే దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండ‌గా, లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలలో జ‌ర‌గ‌నున్నాయి‌.

ఏడు ద‌శ‌ల‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల‌లో మొద‌టి ద‌శ ఏప్రిల్ 19వ తేదీన 21 రాష్ట్రాల్లో జరగనుంది. ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఇక నాలుగో దశ పోలింగ్ మే 13వ తేదీన ఉంటుంది. ఐదవ దశ పోలింగ్ మే 20 న జరగనుంది. ఆరవ దశ పోలింగ్ మే 25వ తేదీన జరగనుండగా, చివరి దశ 7వ దశ పోలింగ్ జూన్ 1న ఉంటుంది. జూన్ 4వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని ఎన్నిక‌ల క‌మీష‌న్ తెలియ‌జేసింది. అయితే లోక్‌సభ తొలి దశ నోటిఫికేషన్ మార్చ్ 20న కాగా, నామినేషన్ల గడువు తేదీ మార్చ్ 27, నామినేషన్ల ఉపసంహరణ మార్చ్ 30, పోలింగ్ ఏప్రిల్ 19న ఉండ‌నుంది.

ఇక లోక్‌సభ రెండో దశ నోటిఫికేషన్ మార్చ్ 28, నామినేషన్ల గడువు ఏప్రిల్ 4, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 8, పోలింగ్ ఏప్రిల్ 26 కాగా, లోక్‌సభ మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12, నామినేషన్ల గడువు ఏప్రిల్ 19, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 22, పోలింగ్ మే 7న ఉంటుంది. ఇక లోక్‌సభ నాలుగో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 18, నామినేషన్లకు గడువు ఏప్రిల్ 25, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29, పోలింగ్ మే 13న ఉంటుంది. లోక్‌సభ ఐదవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 26, నామినేషన్ల గడువు మే 3, నామినేషన్ల ఉపసంహరణ మే 6, పోలింగ్ మే 20గా ఉంది. ఇక లోక్‌సభ ఆరవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 29, నామినేషన్ల గడువు మే 6, నామినేషన్ల ఉపసంహరణ మే 9, పోలింగ్ మే 25న ఉంటుంది. లోక్‌సభ ఏడవ దశ నోటిఫికేషన్ మే 7, నామినేషన్ల గడువు మే 14, నామినేషన్ల ఉపసంహరణ మే 17, పోలింగ్ తేదీ జూన్ 1 అని తెలియ‌జేశారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది