తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించక పోవడంపై గత కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలు టీటీడీ చెక్ పెట్టింది. స్వామి దర్శనానికి వారానికి రెండుసార్లు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.
ఈ అంశంలో కొద్ది రోజులుగా తెలంగాణ నేతలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తే తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది.
సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదని భావించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మరోవైపు, టీటీడీపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఉండేదని.. కానీ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. శ్రీశైలం మల్లన్నను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ‘మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. మా తెలంగాణ భక్తుల మీద టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు.
Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. మొన్నటిదాకా…
Sankranthiki Vasthunnam Movie : విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. దిల్…
Ram Charan Cutout : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో…
Allu Arjun : పుష్ప 2 షాక్ తో అల్లు అర్జున్ మరోసారి Daku Maharaj పబ్లిక్ లోకి రావడం…
Mahesh Babu SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అలియాస్ జక్కన్న దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.…
Good News : మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ మందగించడంతో వినియోగాన్ని పెంచడానికి ఫిబ్రవరి బడ్జెట్‌లో…
Venkatesh : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న వెంకటేష్ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా…
2024 Rewind : మరి కొద్ది రోజులలో ఈ ఏడాదికి ముగింపు పడనుంది. 2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై చెరగని…
This website uses cookies.