Tirumala : గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirumala : గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి

 Authored By ramu | The Telugu News | Updated on :28 December 2024,1:02 pm

ప్రధానాంశాలు:

  •  Tirumala : గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించక పోవడంపై గత కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలు టీటీడీ చెక్ పెట్టింది. స్వామి దర్శనానికి వారానికి రెండుసార్లు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.

Tirumala గుడ్‌న్యూస్‌ టీటీడీ కీల‌క నిర్ణ‌యం తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి

Tirumala : గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి

Tirumala  తెలంగాణ‌పునః ప‌రిశీల‌న‌

ఈ అంశంలో కొద్ది రోజులుగా తెలంగాణ నేతలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తే తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది.

సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదని భావించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మరోవైపు, టీటీడీపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఉండేదని.. కానీ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. శ్రీశైలం మల్లన్నను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ‘మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. మా తెలంగాణ భక్తుల మీద టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది