Telangana Power : 24 గంటల కరెంటు వెనుక ఉన్న అప్పుల చీకట్లు నష్టాలు ఇవే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Power : 24 గంటల కరెంటు వెనుక ఉన్న అప్పుల చీకట్లు నష్టాలు ఇవే ..!

Telangana Power : తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ 24 గంటల కరెంటు వెనుక చాలా అప్పులు, నష్టాలు చీకట్లు ఉన్నాయి. పక్క రాష్ట్రాలలో కరెంటు కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్య అనేది లేదు. అయితే ఈ వెలుగుల వెనుక భరించలేనంత అప్పులు ఉన్నాయని ఇప్పుడు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కరెంటు గురించి గొప్పగా చెప్పుకున్నారు. తాము అధికారంలోకి రాకపోతే కరెంటు సమస్య మళ్లీ […]

 Authored By anusha | The Telugu News | Updated on :11 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Power : 24 గంటల కరెంటు వెనుక ఉన్న అప్పుల చీకట్లు నష్టాలు ఇవే ..!

Telangana Power : తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ 24 గంటల కరెంటు వెనుక చాలా అప్పులు, నష్టాలు చీకట్లు ఉన్నాయి. పక్క రాష్ట్రాలలో కరెంటు కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్య అనేది లేదు. అయితే ఈ వెలుగుల వెనుక భరించలేనంత అప్పులు ఉన్నాయని ఇప్పుడు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కరెంటు గురించి గొప్పగా చెప్పుకున్నారు. తాము అధికారంలోకి రాకపోతే కరెంటు సమస్య మళ్లీ మొదలవుతుంది అని అన్నారు. గత పది ఏళ్లలో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. భారీ మొత్తాన్ని వెచ్చించి కొనటమే తప్ప ఉత్పత్తి చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు ఊహించనంతగా పెరిగాయి. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిరోజు క్యాబినెట్ సమావేశం లో విద్యుత్ సంస్థలు కోట్ల అప్పులో కూరుకుపోవడం చూసి విస్మయం వ్యక్తం చేశారు.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తొలుత విద్యుత్ సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను అప్పుల్లో కూర్చారని భారీ మొత్తం వెచ్చించి బయట కొనడమే తప్ప ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పులు 60 వేల కోట్లకు పైగా పెరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో 22 వేల 423 కోట్ల అప్పు ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటి అప్పులు 81 వేల 156 కోట్లకు పెరిగాయి. విద్యుత్ సంస్థల అప్పులకు వడ్డీని నెలకు 1300 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కేవలం నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామని చెప్పుకోవడానికి విద్యుత్ సంస్థలను నిండా ముంచారన్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది.

కొత్త ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీరు వివాదాస్పదమైంది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. డిజైన్ సరిగా లేదని, బొగ్గు ఎక్కువగా వినియోగించుకొని డిజైన్ వాడడం తో పాటు అటవీ ప్రాంతం డిస్ట్రబ్ అవుతుందని అనుమతులు కూడా రాలేదు. ఆ థర్మల్ ప్లాంట్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్తు రావాల్సి ఉంది. భద్రాది పవర్ ప్రాజెక్టులో భారీ స్కామ్ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణి సంస్థలకు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన 21 వేల కోట్ల పైనే ప్రభుత్వం విద్యుత్ తమ ఇష్టానుసారంగా వాడుకుంది. ఇప్పటివరకు ఆ బిల్లులను చెల్లించలేదు. ప్రభుత్వ విద్యుత్ వాడుకున్నందుకు 21 వేల కోట్ల పైగా విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ లెక్కలను సరి చేస్తుందో లేదో చూడాలి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది