Indiramma Athmeeya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా… భూమి లేని రైతుల అకౌంట్లో 6వేల రూపాయలు..!
ప్రధానాంశాలు:
Indiramma Athmeeya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా... భూమి లేని రైతుల అకౌంట్లో 6వేల రూపాయలు..!
Indiramma Athmeeya Bharosa : తెలంగాణ Telangana ప్రభుత్వం వచ్చాక వారు ఇచ్చిన అనేక పథకాలు అమలు అవుతున్నాయి. ఇదే క్రమంలో పండుగ సమయంలో కొత్త పథకాలని కూడా అమలు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిరుపేద రైతు కూలీలకు శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 83,420 మందికి రూ.50.65 కోట్లు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Indiramma Athmeeya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా… భూమి లేని రైతుల అకౌంట్లో 6వేల రూపాయలు..!
Indiramma Athmeeya Bharosa ఇందిరమ్మ స్కీమ్..
తొలి విడతలో 18,180 మంది కూలీలకు రూ.6 వేల చొప్పున నిధులు అందించగా, రెండో విడతలో 66,240 మంది లబ్ధిదారులకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.39.74 కోట్లు విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 83,420 మంది రైతు కూలీలకు రూ.50.65 కోట్లు చెల్లించారు.
అర్హులైనప్పటికీ నిధులు అందని వారు తక్షణమే మండల అధికారులను సంప్రదించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక, మిగిలిన అర్హుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతు Farmersకూలీలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, భవిష్యత్తులో మరింత మంది లబ్ధిదారులను చేర్చేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు అర్హులైన వారికి తప్పక నిధులు అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు.