Tellam venkat rao : గోదావరి వరద ప్రవాహంతో ఇబ్బందులు.. ఇద్దరు గర్బిణీలకి ప్రసవం చేసిన ఎమ్మెల్యే…
ప్రధానాంశాలు:
Tellam venkat rao : గోదావరి వరద ప్రవాహంతో ఇబ్బందులు.. ఇద్దరు గర్బిణీలకి ప్రసవం చేసిన ఎమ్మెల్యే...
Tellam venkat rao : ప్రస్తుతం గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఏజెన్సీ గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా పురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. తమవారికి ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నేనున్నానంటూ స్టెతస్కోప్ చేతబట్టి, విజయవంతంగా ఆపరేషన్ చేసి ఇద్దరు గర్భిణీలకు కాన్పు చేశారు. ఇద్దరు పండంటి బిడ్డలకు ప్రాణం పోశాడు. ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆస్పత్రి రావడం.. అక్కడ సర్జన్ అందుబాటులోలేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్ చేసి బిడ్డను కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టారు.
వైద్యుడిగా మారిన ఎమ్మెల్యే..
అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసి తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడిన ఆ వైద్యుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సోమవారం సాయంత్రం దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన బేరిబోయిన స్వప్న అనే గర్భిణి రెండో కాన్పుకోసం వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు పురుటినొప్పులొచ్చాయి. సిజేరియన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే కొన్నాళ్లుగా అక్కడ సర్జన్ ఎవరూలేరు. అయితే స్వప్న కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే వెంకట్రావుతో పరిచయం ఉండడంతో వారు ఆయనకు ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే భద్రాచలం ఏరియా వైద్యశాలకు వెళ్లి స్వప్నకు సిజేరియన్ చేశారు. ఎమ్మెల్యేకు ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tellam venkat rao : గోదావరి వరద ప్రవాహంతో ఇబ్బందులు.. ఇద్దరు గర్బిణీలకి ప్రసవం చేసిన ఎమ్మెల్యే…
ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేసే వైద్యులు లేకుండా, కేవలం గైనకాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. అక్కడ పనిచేసే వైద్యులు ఇటీవల బదిలీ కావడం, కొత్త వారిని నియమించక పోవడంతో ఆస్పత్రిలో చేరిన మహిళలు వారి బంధువులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ఆదుకున్నారు. అయితే బదీలలపై ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది. నాకు సివిల్ సర్జన్‌గా పని చేసిన అనుభవం ఉంది. అందుకే నేను వారికి ప్రసవం చేయగలిగాను. ఈ ఆస్పత్రిలో ఒక్కరే గైనాకాలజిస్ట్ ఉన్నారు. వరదల కారణంగా వారిని ఎటు తరలించే అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కాకుండా నేను ముందుగా ఒక డాక్టర్‌గా స్పందించాలి. నేను వారికి ప్రసవం చేశాను అంటూ తెల్లం వెంకట్రావు తెలియజేశారు.