Shanti Swaroop : దూరదర్శన్ తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
ప్రధానాంశాలు:
Shanti Swaroop : దూరదర్శన్ తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
Shanti Swaroop : తెలుగు తొలి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు. ఈ రోజు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో శాంతిస్వరూప్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గత రెండు రోజుల క్రితం గుండెపోటు రావడం కుటుంబ సభ్యులు వెంటనే శాంతిస్వరూప్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఈయన చిక్సిత తీసుకుంటు కన్నుమూశారు.
Shanti Swaroop 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ చదవడం ప్రారంభం
శాంతిస్వరూప్ 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. ఆయన టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 సంవత్సరాల పాటు వార్తలు చదివేవారు. న్యూస్ రీడర్ అంటే తెలుగు ప్రజలకు శాంతిస్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 2011లో తన ఉద్యోగానికి పదవీ విరమణ ఇచ్చారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన న్యూస్ చదువుతూనే ఉన్నారు.
శాంతిస్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా కూడా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.