Shanti Swaroop : చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ ఇంట్లోకి కూడా రానివ్వలేదు – దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Shanti Swaroop : చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ ఇంట్లోకి కూడా రానివ్వలేదు - దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ సంచలన వ్యాఖ్యలు..!
Shanti Swaroop : ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో శాంతి స్వరూప్ తొలి తెలుగు యాంకర్. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రేక్షకులకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా మంచి అనుభవం ఉంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకసారి నందమూరి తారక రామారావు ను ఇంటర్వ్యూ చేయడానికి వారి నివాసానికి వెళ్లాను అని, ఆరోజు ఆయన గొంతు బాగుండకపోవడంతో తర్వాతి రోజు రమ్మన్నారని, అదే రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఇంట్లో కింద ఉన్నారని, అప్పుడు ఆయన కేవలం అల్లుడు గానే ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
ఇక సినిమా హీరోలందరిని ఇంటర్వ్యూ చేశానని, అక్కినేని నాగేశ్వరరావు చాలా చమత్కారంగా మాట్లాడుతారని అన్నారు. ఇక అప్పటి గవర్నర్ కేసి అబ్రయం అనే మలయాళీ తెలుగు రాకపోయినా తెలుగు న్యూస్ చానల్స్ చూసేవాడని, ఒకరోజు నన్ను పిలిచి నీకు పెద్ద అభిమాని అని అన్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని శాంతి స్వరూప్ అన్నారు. అలాగే మీకు బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త సంతోషకరమైన వార్త ఏది అని ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలు అని చెప్పారు. మొదటి విషాదకరమైన వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం. ఇందిరాగాంధీ మరణించారని అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి. ఆమె మరణం ఒక సంచలనం అని చెప్పుకొచ్చారు.
రెండో వార్త ఏది అడగగా ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త అని శాంతి స్వరూప్ చెప్పారు. ఇందిరా గాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ మరణం చాలా దారుణం, మరణంలో ఆయన శరీరం ముక్కలు ముక్కలైందని, అందుకే వార్త ఇప్పటికి నాకు గుర్తొస్తుందని సీనియర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ వెల్లడించారు. ఇక శాంతి స్వరూప్ కి అప్పట్లో లక్షల 50 వేల జీతం ఉండేదని అన్నారు. అప్పట్లో శాంతి స్వరూప్ కి న్యూస్ రీడర్గా ఎంతో గుర్తింపు ఉంది. దూరదర్శన్ ఛానల్ కి మొట్టమొదటి న్యూస్ రీడర్ అతనే. ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయం ఉంది. అప్పట్లో స్టార్ హీరోల ఇంటర్వ్యూలు తీసుకునేవారు. అలాగే రాజకీయ వార్తలు కూడా చెప్పేవారు. తొలి తెలుగు యాంకర్ గా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రేక్షకులకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం.