Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!

Brahmotsavams  : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, ముల్లి పావని జగ్గయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్, మాజీ కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరంతా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Brahmotsavams ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు

Brahmotsavams : ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!

Brahmotsavams  : రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్

మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏదులాబాద్ గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఒక గొప్ప సంప్రదాయమని, ఈ ఉత్సవాలు గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలని, స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ధార్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

కందుల కుమార్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనను అభినందించారు. ఈ ఉత్సవాలకు గ్రామస్తులే కాకుండా, పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై స్వామివారు కనువిందు చేశారు. భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది