Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!
Kakatiya University : ములుగు జిల్లా : ములుగు జిల్లాలోని మహర్షి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఈ కళాశాలలో విద్యార్థులు తరగతులకు హాజరుకాని, సిలబస్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా, వారికి ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షల్లో డబ్బులు తీసుకుని మార్కులు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సంఘటిత విద్యార్థి నాయకులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సహకారంతో ఈ అక్రమాలు నడుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు కనీసం తరగతులు నిర్వహించకుండా, స్కాలర్‌షిప్ డబ్బులు పొందేందుకు హాజరు నమోదు చేయించుకుంటూ, వారితో సంతకాలు పెట్టించుకుంటూ, అవతల వారు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!
ఈ కళాశాలలో విద్యార్థుల హాజరు కోసం తప్పుడు బయోమెట్రిక్ రికార్డులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వారిని తరగతులకు రాకుండా ఉంచి, పరీక్షల్లో నైపుణ్యం లేకపోయినా లంచం ద్వారా మార్కులు కేటాయించడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. విద్యను వ్యాపారంగా మార్చుకుని, డబ్బుల కోసమే విద్యార్థుల జీవితాలను ముప్పు పెడుతున్న ప్రైవేట్ కళాశాలల ధోరణి మీద విద్యార్థి సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
ఈ అవకతవకలపై కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ఛాన్సలర్ వెంటనే స్పందించి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు హాజరు నమోదు చేసే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యా నియంత్రణ సంస్థలను కోరుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకు రాకుండా ఉంచి, కేవలం మార్కుల కోసం అక్రమ మార్గాలు అవలంబించడం విద్యార్థులకు మేలు చేయదని, దీని వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు దూరమవుతాయని అంటున్నారు. విద్యార్హతలు లేనివారు దేశ భవిష్యత్తును నాశనం చేయడమే తప్ప ప్రయోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యా అవకతవకలను నియంత్రించేందుకు ప్రభుత్వం, విద్యా నియంత్రణ సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సరైన విద్యను అందించేలా ప్రభుత్వ విధానాలను కఠినంగా అమలు చేయాలి. విద్యార్థులు రేపటి పౌరులు – దేశ భవిష్యత్తు. వారి జీవితాలతో చెలగాటమాడే ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమాలకు పాల్పడే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.