Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 February 2025,3:30 am

ప్రధానాంశాలు:

  •  ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అనైతిక విధానాలు – విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న యాజమాన్యం

Kakatiya University : ములుగు జిల్లా  :  ములుగు జిల్లాలోని మహర్షి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఈ కళాశాలలో విద్యార్థులు తరగతులకు హాజరుకాని, సిలబస్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా, వారికి ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షల్లో డబ్బులు తీసుకుని మార్కులు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సంఘటిత విద్యార్థి నాయకులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ సహకారంతో ఈ అక్రమాలు నడుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు కనీసం తరగతులు నిర్వహించకుండా, స్కాలర్‌షిప్ డబ్బులు పొందేందుకు హాజరు నమోదు చేయించుకుంటూ, వారితో సంతకాలు పెట్టించుకుంటూ, అవతల వారు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Kakatiya University కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం

Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!

Kakatiya University : విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కళాశాలలు

ఈ కళాశాలలో విద్యార్థుల హాజరు కోసం తప్పుడు బయోమెట్రిక్ రికార్డులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వారిని తరగతులకు రాకుండా ఉంచి, పరీక్షల్లో నైపుణ్యం లేకపోయినా లంచం ద్వారా మార్కులు కేటాయించడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. విద్యను వ్యాపారంగా మార్చుకుని, డబ్బుల కోసమే విద్యార్థుల జీవితాలను ముప్పు పెడుతున్న ప్రైవేట్ కళాశాలల ధోరణి మీద విద్యార్థి సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

Kakatiya University కాకతీయ యూనివర్సిటీ తక్షణ జోక్యం అవసరం

ఈ అవకతవకలపై కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ఛాన్సలర్ వెంటనే స్పందించి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు హాజరు నమోదు చేసే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యా నియంత్రణ సంస్థలను కోరుతున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన – విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకము

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకు రాకుండా ఉంచి, కేవలం మార్కుల కోసం అక్రమ మార్గాలు అవలంబించడం విద్యార్థులకు మేలు చేయదని, దీని వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు దూరమవుతాయని అంటున్నారు. విద్యార్హతలు లేనివారు దేశ భవిష్యత్తును నాశనం చేయడమే తప్ప ప్రయోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం, విద్యా నియంత్రణ సంస్థలు స్పందించాలి

ఈ విద్యా అవకతవకలను నియంత్రించేందుకు ప్రభుత్వం, విద్యా నియంత్రణ సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సరైన విద్యను అందించేలా ప్రభుత్వ విధానాలను కఠినంగా అమలు చేయాలి. విద్యార్థులు రేపటి పౌరులు – దేశ భవిష్యత్తు. వారి జీవితాలతో చెలగాటమాడే ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమాలకు పాల్పడే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది