Telangana : మనం ఆధునిక సమాజ స్థాపన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కానీ, ఎక్కడో ఒక చోట రాతికాలం యొక్క స్వభావాన్ని మనిషి ప్రదర్శిస్తూనే ఉన్నాడు.. మన దేశంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తే , ఇంకా మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే మనిషన్నవాడు ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపిస్తుంది.
మహాబుబాబాద్ జిల్లా థోర్రూర్‌కు చెందిన పది పన్నెడు ఏళ్ల ఉండే ఇద్దరు కుర్రాళ్లు ఒక పొలంలో మామిడి పళ్లు దొంగతనం చేశారు . ఆ సమయంలో వాళ్ళను పట్టుకున్న ఆ పొలం యజమానులు ఆ ఇద్దరినీ కట్టేసి కర్రలతో గొడ్డును బాదినట్లు కొట్టటమే కాకుండా దారుణంగా ఆవు పేడను బలవంతంగా వాళ్ళతో తినిపించే ప్రయత్నం చేస్తూ నోట్లో కుక్కటం జరిగింది..
ఇలాంటి నీచమైన పనులు చేయటమే కాకుండా దానిని వీడియో తీసి శునకానందం పొందారు.. దీనితో ఆ వీడియో ఒకరి నుండి ఒకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్తు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, అలాంటి దారుణమైన సంఘటన చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ఆ సంఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది..
నిజానికి ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల జరుగుతాయని మనం చూస్తూనే ఉన్నాం, ప్రేమించారని మూత్రం తాగించటం,, భర్త మాట వినలేదని బట్టలు విప్పి రోడ్డు మీద ఆడవాళ్లను పరిగెత్తించటం, లాంటి అమానుష సంఘటనలు ఎన్నో చూశాం . ఇప్పుడు తెలంగాణ లో జరిగిన దుశ్చర్య కూడా వాటికీ ఏమి తక్కువ కాదు.. దీనిపై పోలీసులు విచారణ జరిగి, ఆయా నిందుతులపై కఠిన చర్యలు తీసుకోని అలాంటి నీచమైన పనులు చేయాలి అనుకునేవాళ్ళకి కనువిప్పు కలిగించాలి
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.