మనిషన్నవాడు చేసే పని కాదు.. తెలంగాణలో దారుణం.. ఇద్దరి కుర్రాల్లా నోటిలో..

0
Advertisement

Telangana  : మనం ఆధునిక సమాజ స్థాపన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కానీ, ఎక్కడో ఒక చోట రాతికాలం యొక్క స్వభావాన్ని మనిషి ప్రదర్శిస్తూనే ఉన్నాడు.. మన దేశంలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తే , ఇంకా మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే మనిషన్నవాడు ఇలాంటి పనులు కూడా చేస్తారా అనిపిస్తుంది.

మహాబుబాబాద్ జిల్లా థోర్రూర్‌కు చెందిన పది పన్నెడు ఏళ్ల ఉండే ఇద్దరు కుర్రాళ్లు ఒక పొలంలో మామిడి పళ్లు దొంగతనం చేశారు . ఆ సమయంలో వాళ్ళను పట్టుకున్న ఆ పొలం యజమానులు ఆ ఇద్దరినీ కట్టేసి కర్రలతో గొడ్డును బాదినట్లు కొట్టటమే కాకుండా దారుణంగా ఆవు పేడను బలవంతంగా వాళ్ళతో తినిపించే ప్రయత్నం చేస్తూ నోట్లో కుక్కటం జరిగింది..

Telangana : దీనిపై యావత్తు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం

ఇలాంటి నీచమైన పనులు చేయటమే కాకుండా దానిని వీడియో తీసి శునకానందం పొందారు.. దీనితో ఆ వీడియో ఒకరి నుండి ఒకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్తు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, అలాంటి దారుణమైన సంఘటన చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ ఆ సంఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది..

నిజానికి ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల జరుగుతాయని మనం చూస్తూనే ఉన్నాం, ప్రేమించారని మూత్రం తాగించటం,, భర్త మాట వినలేదని బట్టలు విప్పి రోడ్డు మీద ఆడవాళ్లను పరిగెత్తించటం, లాంటి అమానుష సంఘటనలు ఎన్నో చూశాం . ఇప్పుడు తెలంగాణ లో జరిగిన దుశ్చర్య కూడా వాటికీ ఏమి తక్కువ కాదు.. దీనిపై పోలీసులు విచారణ జరిగి, ఆయా నిందుతులపై కఠిన చర్యలు తీసుకోని అలాంటి నీచమైన పనులు చేయాలి అనుకునేవాళ్ళకి కనువిప్పు కలిగించాలి

Advertisement