Current Bill : తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పొందాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే….!
ప్రధానాంశాలు:
Current Bill : తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పొందాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే....!
Current Bill : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గృహ జ్యోతి యోజన పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం కచ్చితంగా పూర్తి బిల్లును చెల్లించాల్సిందే. కానీ ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఫ్యాన్లు, ఏసీలు ,కూలర్స్ లేకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొన్నటి వరకు 200 యూనిట్ల వరకు వచ్చిన కరెంట్ బిల్లు వేసవికాలం వచ్చేసరికి అమాంతం పెరిగిపోతుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గృహ జ్యోతి పథకాన్ని ఎవరో సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు ఒక్క రూపాయి కరెంట్ బిల్లు కూడా కట్టుకోకుండా తప్పించుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Current Bill : ఈ టిప్స్ పాటించండి…
అయితే ప్రస్తుతం విద్యుత్ బిల్లు అనేది నెలవారి బడ్జెట్ లో చేర్చవలసిన అంశం కావడంతో ఎక్కువ విద్యుత్ ని ఉపయోగిస్తే అధిక బిల్లు రావడంతో పాటు ప్రభుత్వంపై కూడా భారం పడుతుంది.. అంతేకాక ఈ ఏడాది వర్షాలు లేకపోవడం వలన నీటి కొరత ఏర్పడింది. దీంతో సరైన విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంతో విద్యుత్ కొరత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో విద్యుత్ ను ఆదా చేయడం అనేది ప్రతి పౌరుని బాధ్యత. కావున మీరు మీ ఇంట్లో అనవసరమైన విద్యుత్ ను ఎలా ఆదా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం… ముందుగా మీరు మీ ఇంట్లో ఏసీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగిస్తున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే కొత్త మోడల్ 5 స్టార్ వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఇవి చాలా వరకు విద్యుత్ ను ఆదా చేస్తాయి. ఇలాంటి 5 స్టార్ మరియు కంపెనీ వస్తువులను తీసుకోవడం వలన ఆటోమేటిక్ గానే మీ విద్యుత్ ఆదా అవుతుంది. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఏసీలను వినియోగిస్తున్నప్పుడు 24 డిగ్రీల వద్ద ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే ఏసీ లను తీసుకోవడం మంచిది. తద్వారా మీరు మీ విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.
Current Bill : స్టాండ్ బై మోడ్..
అలాగే మనం చాలా సందర్భాలలో టీవీలను స్టాండ్ బై మోడ్ లో ఉంచేస్తాం. అలాగే లాప్టాప్ చార్జెస్ ,ఫోన్ చార్జెస్ ప్లగ్ తీసివేయకుండా అలాగే స్విచ్ ఆన్ చేసి మర్చిపోతూ ఉంటాం. ఇక ఇది మీకు చిన్న సమస్య కావచ్చు కానీ ఈ విధంగా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను స్టాండ్ బై మోడ్ లో ఉంచడం వలన అవి మరింత విద్యుత్ వినియోగించుకుంటాయి. తద్వారా కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కావున మీరు పని పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.
Current Bill LED బల్బ్స్…
మీ ఇంట్లో సాదాసీదా బల్బులను వాడుతున్నట్లయితే వాటికి బదులుగా ఎల్ఈడీ బల్బును ఉపయోగించడం మంచిది. ఇది మీ పాత బల్బుల కంటే కూడా మెరుగైన మార్గంలో విద్యుత్ ఆదా చేస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను అవసరం అయినప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. అలాగే ప్రస్తుతం వేసవికాలం కావడం వలన ప్రతి ఒక్కరూ ఇంటి కిటికీలను తలుపులను మూసి ఉంచుతున్నారు. అలా కాకుండా ఇంట్లోకి చల్లటి గాలి సూర్యరశ్మి వచ్చేలా చేయడం మంచిది. తద్వారా ఇంట్లోకి చల్లటీ గాలి రావడంతో 24 గంటలు ఏసీలు నడపాల్సిన అవసరం ఉండదు.ఈ విధంగా విద్యుత్తు ఆదా చేయటం అనేది మీ యొక్క నెలవారి బడ్జెట్ ను తగ్గించడంతోపాటు ప్రస్తుతం వేసవికాలంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను కాస్త కాపాడిన వారు అవుతారు. కాబట్టి విద్యుత్ ను పొదుపుగా వాడండి.విద్యుత్ కొరతను తగ్గించండి.