Viral Video : వరదలలో చలానాలు అంటూ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ కంట్రోల్ రూమ్..!!
Viral Video : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వారం రోజులకు పైగా కురిసిన వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే. భారీ వరదలకు చాలామంది నిరాశ్రులయ్యారు. నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లటంతో పాటు వరద నీరు గ్రామాల్లోకి వచ్చి ఇళ్లలోకి చేరటంతో.. ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అధికారులు ఇంకా ఎన్డిఆర్ఎఫ్ బృందం.. సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
ఇదే సమయంలో చాలా రహదారులపై రోడ్లపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాదారులు అష్ట కష్టాలు పడటం జరిగింది. హైదరాబాదులో సైతం రికార్డ్ స్థాయిలో వర్షం పడింది. కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో సైబరాబాద్ అయోధ్య క్రాస్ రోడ్డు లో వాటర్ లాగింగ్ లో భారీగా వరద నీరు చేరుకోవటంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఫోటోను తీశారు.
అయితే అంత వర్షంలో కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా రాస్తున్నట్లు ఓ వీడియో రావడంతో.. తీవ్రంగా నెగిటివ్ కామెంట్లు రావడం జరిగింది. అయితే వర్షపు నీరు తొలగింపు చర్యల్లో కోసం సదరు ట్రాఫిక్ పోలీసు వీడియో తీసినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ విభాగం ఈ వీడియో పై క్లారిటీ ఇచ్చింది.
వరదల్లో చలాన్ల పై పోలీసుల క్లారిటీ
వరదల్లోనూ ఓ ట్రాఫిక్ పోలీస్ చలాన్ల కోసం ఫొటోలు తీస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయ్యింది.
దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ పై ఫొటోలో ఏ విధమైన చలాన్ వేయలేదని, అయోధ్య క్రాస్ రోడ్డులో వాటర్ లాగింగ్ అయితే తొలగింపు చర్యల… pic.twitter.com/DVTOCqazhl
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2023