Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..!
ప్రధానాంశాలు:
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..!
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 30, 2025 నాటికి పూర్తి ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ప్రారంభించింది.

Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..!
Local Election శరవేగంగా..
కలెక్టర్లకు SEC కీలక సూచనలు చేసింది. జిల్లా స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని, బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సిబ్బంది, ఇతర అవసరమైన వనరుల సమాచారాన్ని నిర్దేశిత నమూనాలో సమర్పించాలంటూ సూచనలు చేసింది.మండలాలవారీగా అన్ని పంచాయతీల ఎన్నికలు ఒకే దశలో జరగాలన్న దిశగా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించింది.
కొత్తగా కొన్ని గ్రామాలు నగరపాలక సంస్థల్లో విలీనం కావడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని,పూర్తి వివరాలతోగా సమాచారాన్ని అందించాలని SEC స్పష్టం చేసింది.ఇక ఇటీవల ఏర్పడిన కొత్త పంచాయతీలు, వార్డుల నేపథ్యంలో, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు పంచాయతీల వారీగా ఓటర్ల నూతన జాబితా తయారీ మంగళవారం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పరిశీలనలో ఉంది. ఎటువంటి జాప్యం ఉండకుండా స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తి చేయాలని హైకోర్టు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.