Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్ర‌మాదం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్ర‌మాదం

 Authored By prabhas | The Telugu News | Updated on :24 January 2025,2:59 pm

ప్రధానాంశాలు:

  •  Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్ర‌మాదం

Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam Kumar Reddy  Convoy కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో మంత్రి ప‌ర్య‌టిస్తుండ‌గా తన uttam kumar reddy convoy accident కాన్వాయ్‌లో కార్లు గుంతలో చిక్కుకుని ప్రమాదం భారిన ప‌డ్డాయి. ఈ ప్ర‌మాదం నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు.

Uttam Kumar Reddy మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్ర‌మాదం

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్ర‌మాదం

సంఘటన వివరాలు

జనపహాడ్‌లో ఉర్సు వేడుకలకు హాజరయ్యేందుకు మంత్రి వెళ్తుండ‌గా గరిడేపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది. మంత్రి వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడంతో కాన్వాయ్‌కు అంతరాయం కలిగింది. కాన్వాయ్‌లోని మరో ఎనిమిది కార్లు ఢీకొన్నాయి.

రోడ్డు పక్కన నిలబడి ఉన్న పార్టీ కార్యకర్తలను కలవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన డ్రైవర్‌ను ఆపమని చెప్పినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఎనిమిది కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత మంత్రి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది