Revanth Reddy : రేవంత్ రెడ్డి జిల్లాలో నిర‌స‌న చేస్తున్న ఓట‌ర్లు.. ఖాళీగా క‌నిపించిన పోలింగ్ బూత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : రేవంత్ రెడ్డి జిల్లాలో నిర‌స‌న చేస్తున్న ఓట‌ర్లు.. ఖాళీగా క‌నిపించిన పోలింగ్ బూత్

Revanth Reddy : ఈ రోజు తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి వాతావ‌ర‌వణం నెల‌కొంది. పోలింగ్ డే కావ‌డంతో ఉద‌యం 7గంల నుండే ఓట‌ర్లు పోలింగ్ బూత్‌కి చేరుకొని ఓటు వేసేందుకు ఆస‌క్తి చూపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఎక్కువ ఓట్లు వేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే సాధార‌ణంగా ఎక్కువ ఓట్లు పోల్ అయితే ఆ పోలింగ్ బూత్‌ల గురించి వార్త‌ల‌లో చెబుతుంటారు కాని ఇప్పుడు తెలంగాణ‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 May 2024,11:17 pm

Revanth Reddy : ఈ రోజు తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి వాతావ‌ర‌వణం నెల‌కొంది. పోలింగ్ డే కావ‌డంతో ఉద‌యం 7గంల నుండే ఓట‌ర్లు పోలింగ్ బూత్‌కి చేరుకొని ఓటు వేసేందుకు ఆస‌క్తి చూపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఎక్కువ ఓట్లు వేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే సాధార‌ణంగా ఎక్కువ ఓట్లు పోల్ అయితే ఆ పోలింగ్ బూత్‌ల గురించి వార్త‌ల‌లో చెబుతుంటారు కాని ఇప్పుడు తెలంగాణ‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జ‌ర‌గ‌కుండా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే అదీ ఇదీ కాదు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఓ గిరిజన గ్రామం కావడం విశేషం.

Revanth Reddy మేము ఓటు వేయ‌మంటూ నిర‌స‌న‌

పోలింగ్ సిబ్బందికి పనిలేకుండా గ్రామ ప్ర‌జ‌లు నిర‌స‌న తెలియ‌జేస్తూ హాట్ టాపిక్‌గా మారారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు కూడా ఉన్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తోందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కాని, కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Revanth Reddy రేవంత్ రెడ్డి జిల్లాలో నిర‌స‌న చేస్తున్న ఓట‌ర్లు ఖాళీగా క‌నిపించిన పోలింగ్ బూత్

Revanth Reddy : రేవంత్ రెడ్డి జిల్లాలో నిర‌స‌న చేస్తున్న ఓట‌ర్లు.. ఖాళీగా క‌నిపించిన పోలింగ్ బూత్

ఎన్నికల సీజన్ కావడంతో వారంతా ఒక్కతాటిపైకి వచ్చి ఓటు వేయకుండా గ్రామంలోనే బైఠాయించి తమ నిరసన తెలియ‌జేశారు. గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించడంతో పోలింగ్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్‌ సిబ్బంది హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థులు మాత్రం బెట్టువీడలేదు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తే కానీ ఓటు వేయడానికి రాలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించి ఆందోళన చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది