Praneeth Rao : 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Praneeth Rao : 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Praneeth Rao : 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు..!

Praneeth Rao : తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. బీఆర్ ఎస్ నేతలకు ఉచ్చు బిగించేలా దాన్ని ముందుకు నడిపిస్తోంది. ఏ క్షణం అయినా బీఆర్ ఎస్ బడా నేతల గుట్టు రట్టు కావడం ఖాయం అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేశామని కుండ బద్దలు కొట్టేశారు.

Praneeth Rao 8 ఫోన్ల ద్వారా..

జడ్జిలు, రాజకీయ నేతలు ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేసినట్లు ప్రణీత్ రావు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు టాప్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాము ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్టు తెలిపారు. కేవలం మూడు ఫోన్లను అధికారికంగా ఇస్తే.. మిగతా ఐదు ఫన్లను అనధికారికంగా వాడినట్టు తెలిపాడు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసి.. ఆ నగదు మొత్తాన్ని పట్టుకున్నట్టు వివరించాడు.

Praneeth Rao 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

Praneeth Rao : 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు..!

పట్టు కున్న నగదును హవాలా డబ్బుగా చూపించి రికార్డులు సృష్టించినట్టు తెలిపాడు ప్రణీత్ రావు. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ప్రభాకర్ రావు సాయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహించినట్టు తెలిపారు ప్రణీత్ రావు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాపింగ్ ఆపేయాలంటే ప్రభాకర్ రావు ఆదేశించారు. దాంతో వెంటనే ఆపేశాం. 17 హార్డ్ డిస్క్ లలో కీలక సమాచారం ఉంది. కానీ వాటిని ధ్వంసం చేయాలంటూ ప్రభాకర్ రావు చెప్పడంతో వాటిని కట్టర్ లతో కట్ చేశాం.

సిస్టమ్ లు, పెన్ డ్రైవ్ లను ఫార్మట్ చేశాం. వాటి ప్లేస్ లోకొత్త హార్డ్ డిస్క్ లను ఏర్పాటు చేశాం. కట్ చేసిన హార్డ్ డిస్క్ లను మూసీ నదిలో పడేశామని తెలిపాడు ప్రణీత్ రావు. అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేసినట్టు తెలిపాడు ప్రణీత్ రావు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది