KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోధ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కాలు తుంటికి ఆపరేషన్ చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ చేశారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్న కేసీఆర్ కు సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ను నిలబెట్టి వాకర్ తో నడిపించే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఆయనకు కాసేపు నడక ప్రాక్టీస్ చేయించారు. డిసెంబర్ 7న రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంట్లో కేసీఆర్ బాత్ రూమ్ కు వెళ్లి కాలుజారి పడ్డారు. దీంతో తన ఎడమ కాలు తుంటి విరిగింది. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటనే తెల్లారి డిసెంబర్ 8న డాక్టర్లు కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ చేసి హిప్ ను రీప్లేస్ చేశారు.
కేసీఆర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనతోనే ఉన్నారు కేటీఆర్. కేసీఆర్ భార్య, కేసీఆర్ కూతురు కవిత, మనవడు హిమాన్షు అందరూ వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నారు. కేటీఆర్ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ కు అలా జరిగిందని తెలుసుకొని వెంటనే బీఆర్ఎస్ అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వెంటనే బాగుపడాలని దేవుడిని ప్రార్థించారు. హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.
సర్జరీ తర్వాత యశోద డాక్టర్లు కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ కు సర్జరీ చేసిన విధానాన్ని వివరించారు. హిప్ రీప్లేస్ మెంట్ ఎందుకు చేశామో తెలిపారు. రీప్లేస్ చేయడానికి గల కారణాలు కేటీఆర్ కు తెలిపారు. కేసీఆర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. కొన్ని వారాల్లో ఆయన మామూలు వ్యక్తిలా నడుస్తారని చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.