KCR : సర్జరీ పూర్తయ్యాక కేసీఆర్ కు ఏమైందో కేటీఆర్ కు చెప్పిన డాక్టర్లు.. ఆ మాట విని ఉలిక్కిపడ్డ కేటీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : సర్జరీ పూర్తయ్యాక కేసీఆర్ కు ఏమైందో కేటీఆర్ కు చెప్పిన డాక్టర్లు.. ఆ మాట విని ఉలిక్కిపడ్డ కేటీఆర్

KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోధ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కాలు తుంటికి ఆపరేషన్ చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ చేశారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్న కేసీఆర్ కు సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ను నిలబెట్టి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ చేసిన యశోద వైద్యులు

  •  కేటీఆర్ తో మాట్లాడిన వైద్యులు

  •  6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం

KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోధ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కాలు తుంటికి ఆపరేషన్ చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ చేశారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్న కేసీఆర్ కు సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ను నిలబెట్టి వాకర్ తో నడిపించే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఆయనకు కాసేపు నడక ప్రాక్టీస్ చేయించారు. డిసెంబర్ 7న రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంట్లో కేసీఆర్ బాత్ రూమ్ కు వెళ్లి కాలుజారి పడ్డారు. దీంతో తన ఎడమ కాలు తుంటి విరిగింది. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటనే తెల్లారి డిసెంబర్ 8న డాక్టర్లు కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ చేసి హిప్ ను రీప్లేస్ చేశారు.

కేసీఆర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనతోనే ఉన్నారు కేటీఆర్. కేసీఆర్ భార్య, కేసీఆర్ కూతురు కవిత, మనవడు హిమాన్షు అందరూ వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నారు. కేటీఆర్ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ కు అలా జరిగిందని తెలుసుకొని వెంటనే బీఆర్ఎస్ అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వెంటనే బాగుపడాలని దేవుడిని ప్రార్థించారు. హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.

KCR : డాక్టర్లతో మాట్లాడిన కేటీఆర్

సర్జరీ తర్వాత యశోద డాక్టర్లు కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ కు సర్జరీ చేసిన విధానాన్ని వివరించారు. హిప్ రీప్లేస్ మెంట్ ఎందుకు చేశామో తెలిపారు. రీప్లేస్ చేయడానికి గల కారణాలు కేటీఆర్ కు తెలిపారు. కేసీఆర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. కొన్ని వారాల్లో ఆయన మామూలు వ్యక్తిలా నడుస్తారని చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది