Uttam Kumar Reddy : ఉత్తమ్ అటా ఇటా.. పెద్ద కన్ఫ్యూజన్.. ఆయన వెనుక పొగ పెడుతున్నవాళ్లు ఎవరు?
Uttam Kumar Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటో అందరికీ తెలుసు. కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా చాలా ఏళ్ల పాటు పనిచేశారు కానీ.. కాంగ్రెస్ పార్టీని అనుకున్నంతగా తెలంగాణలో బలోపేతం చేయలేకపోయారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. ఏది ఏమైనా.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య ఈ వివాదాలు, గొడవలు ఎప్పుడూ ఉండేవే కదా. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. విమర్శించుకోవడం కూడా సహజమే. బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు కొట్లాడుకుంటారు.
ఇదంతా పక్కన పెడితే అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో చాలా కొత్తగా జరుగుతోంది. ఆయన పరిస్థితి చాలా డిఫరెంట్ గా మారింది. ఎందుకంటే.. ఆయన పార్టీ మారుతున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. తన అనుచరులతో కలిసి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ఇటీవల విపరీతమైన ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కూడా నమ్మాల్సి వచ్చింది అంటే ఆ ప్రచారం ఏ లేవల్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఉత్తమ్ మాత్రం తాను పార్టీ మారడం లేదని.. తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని చాలా సార్లు చెప్పుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆయన పార్టీ మార్పుపై వచ్చే ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు.ఇవన్నీ చూస్తుంటే.. కావాలనే ఉత్తమ్ ను ఎవరో టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. అవును.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు పార్టీ మారుతానని ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ.. కావాలనే ఆయనపై తప్పుడు ప్రచారాన్ని ఎవరో చేస్తున్నారు.
Uttam Kumar Reddy : కావాలనే ఉత్తమ్ ను ఎవరైనా టార్గెట్ చేశారా?
అసలు ఆ తప్పుడు ప్రచారం చేసేది ఎవరు అనేదానిపై క్లారిటీ లేదు కానీ.. తన సొంత పార్టీకి చెందిన వాళ్లే ఈ ప్రచారాన్ని ప్రారంభించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనే సొంత పార్టీ నేతలు ఉత్తమ్ ను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీని వదిలేసేంత వరకు వాళ్లు వదిలేలా లేరు. ఉత్తమ్ పార్టీ వదిలి వెళ్తే ఎవరికి లాభం. ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది. వాళ్లే కావాలని ఉత్తమ్ పార్టీ మార్పుపై ప్రచారం చేస్తున్నారని స్పష్టమౌతోంది. చూద్దాం ఈ ఊహాగానాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో?