Kcr : అడ్డదారి? దొడ్డిదారి? ఏది దొరికితే అదే కేసీఆర్ కు దారి?
KCR జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా అయ్యింది. ఎన్నో విధాలుగా కేసీఆర్ ప్రయత్నించినా కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 56 స్థానాలు వచ్చాయి.
తెలంగాణ గత ఎన్నికల్లో 99 సీట్లు దక్కించుకున్న టీఆర్‌ఎస్ అనూహ్యంగా 56 స్థానాలకు దిగజారడంతో ఏం చేయాలో పాలుపోక ఇన్నాళ్లు మేయర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండి పోయింది. వచ్చే నెల 11 వ తారీకుతో ప్రస్తుతం ఉన్న మేయర్ పదవి కాలం ముగుస్తుంది. కనుక ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మేయర్ ఎన్నిక సజావుగా సాగితే ఖచ్చితంగా ఏ పార్టీకి అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం లేదు. ఏవైనా రెండు పార్టీలు కలిస్తే తప్ప మేయర్ పీఠంను దక్కించుకునే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో మేయర్ పీఠం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏంటీ అనేది రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.
మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో కేసీఆర్ రహస్య ఒప్పందంః
వాళ్లు వీళ్లు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా కూడా టీఆర్‌ఎస్ మరియు ఎంఐఎం పార్టీలు మిత్ర పక్షాలు అనడంలో సందేహం లేదు. అయితే ఈ సమయంలో బీజేపీ పదే పదే టీఆర్‌ఎస్ ను హిందు వ్యతిరేక పార్టీ అని ఎంఐఎం పార్టికి అనుకూలమైన పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారు. మేయర్ పీఠంను రెండు పార్టీలు షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ను టార్గెట్ చేసి బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రహస్యంగా అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకుని ఎంఐఎం సాయంతోనే మేయర్ పీఠంను దక్కించుకోవాలని కేసీఆర్ ప్లాన్ గా సమాచారం అందుతోంది.
బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదుః : Kcr
మేయర్ పీఠం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వ కూడదు అంటూ టీఆర్ ఎస్ భావిస్తుంది. వారు ఎలాగూ మేయర్ పీఠంను దక్కించుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయినా కూడా టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠంపై కూర్చుంటే మాత్రం బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు చేసేందుకు సిద్దంగా ఉంది. ఆ అవకాశంను వారికి ఇవ్వ కూడదు అనే ఉద్దేశ్యంతోనే ఎంఐఎం కు కాస్త దూరంగా ఉండటంతో పాటు మేయర్ పీఠంను దక్కించుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారట. మేయర్ పీఠం ఎన్నిక సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం ఎంఐఎం సభ్యులు బయటకు వెళ్తారు. దాంతో టీఆర్‌ఎస్ పార్టీకి ఈజీగా మెజార్టీ దక్కతుంది. దాంతో మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్ మహిళ కార్పోరేటర్ కూర్చుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.