Vijayashanti : యుద్ధ సమయంలో ఈ రాజకీయాలేంటి విజయశాంతి ..?
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం “ఆపరేషన్ సింధూర్” పేరిట తీవ్ర దాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌లో పలువురు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్ విజయంపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. భారత సైన్యం చూపిన శౌర్యాన్ని సమాజం ప్రశంసిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. “భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు.
Vijayashanti : యుద్ధ సమయంలో ఈ రాజకీయాలేంటి విజయశాంతి ..?
1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే… ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే… వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం.. అయితే కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయo అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను.హరహర మహాదేవ్..జై హింద్ ..జై జవాన్” అంటూ రాసుకొచ్చింది.
విజయశాంతి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నెగటివ్ స్పందనలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు అవసరమా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఉత్కంఠ పరిస్థితుల్లో ఈ తరహా ట్వీట్లు ప్రజలను విభజించే అవకాశం ఉన్నందున వాటిని మానుకోవాలని, కొందరైతే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై విమర్శల నేపథ్యంలో విజయశాంతి ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.