Bhu Bharati : భూ భారతి రూల్స్ ఏంటి..? రైతులకు ఎలాంటి లాభాలు..? ఎలాంటి నష్టాలు..?
ప్రధానాంశాలు:
Bhu Bharati : భూ భారతి రూల్స్ ఏంటి..? రైతులకు ఎలాంటి లాభాలు..? ఎలాంటి నష్టాలు..?
Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడానికి రూపొందించిన ఆధునిక డిజిటల్ వ్యవస్థ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పోర్టల్‌ను మొదటగా నలుగురు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. భూ భారతి ద్వారా ప్రతి భూమికి స్పష్టమైన సర్వే, హద్దులు, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి, భూమి యజమానికి భూధార్ కార్డు ఇవ్వనున్నారు. ఇది మనిషికి ఆధార్ లాంటి భద్రత కల్పించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

Bhu Bharati : భూ భారతి రూల్స్ ఏంటి..? రైతులకు ఎలాంటి లాభాలు..? ఎలాంటి నష్టాలు..?
Bhu Bharati : భూ భారతి కి ధరణికి తేడాలు ఏంటి..? దీనివల్ల లాభాలు ఏంటి..?
ధరణి మరియు భూ భారతి మధ్య తేడాలేంటి? – ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం అవసరం. ధరణిలో అనుభవదారు కాలమ్, అప్పీల్ అవకాశాలు లేకపోవడం, వివాదాస్పద భూముల పరిష్కారానికి సరైన మెకానిజం లేకపోవడం వంటి లోపాలను భూ భారతి తీర్చనుంది. కొత్త చట్టం ప్రకారం, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాలు ఇవ్వబడి, సర్వే అనంతరం మాత్రమే మ్యుటేషన్ జరుగుతుంది. పాసు పుస్తకాలలో భూమి మ్యాప్ సహా పూర్తిగా సాంకేతిక ఆధారితమైన రికార్డు సమీకరణ జరుగుతుంది.
ఇక భూ భారతి వల్ల రైతులకు కలిగే లాభాలు మరెన్నో. రైతులకు ఉచిత న్యాయసహాయం, భూమి ట్రిబ్యునల్స్ ఏర్పాటు, అప్రమత్తత కలిగించిన భూ పత్రాలు, డబుల్ రిజిస్ట్రేషన్, గెట్టు వివాదాలకు ముగింపు లాంటి అంశాలు ఇందులో ఉంటాయి. భూ భద్రత, పారదర్శకత, సమగ్ర రికార్డుల సిద్ధతతో భూ భారతి వ్యవస్థ భూ పరిపాలనలో చారిత్రాత్మక మార్పునకు నాంది పలుకుతోంది.