AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
AIYF : కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay సాంస్కృతిక ప్రజా యుద్ధ నౌక గద్దర్ Gaddar ను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. గద్దర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా AIYF ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ సంస్కృతిని, సమాజాన్ని అవమానపర్చేలా హోదాను మర్చి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
భారత రాజ్యాంగం సాక్షిగా పార్లమెంట్ సభ్యుడు గా ఎన్నికైన బండి, కేంద్ర పురస్కార అవార్డు ల అంశంలో ఏ అధికారంతో గద్దర్ గురించి ప్రస్తావించారో తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర అవార్డులు మొత్తం స్వతంత్ర సంస్థ ద్వారా ఎంపిక చేస్తారని,ఆయా రంగాలలో విశిష్ట సేవలకు గాను ప్రధానం చేస్తారే గాని… బండి సంజయ్ చెబితే అవార్డులు ఇవ్వరని వారు స్పష్టంచేశారు. కానీ, ఇవన్నీ తెలిసిన మంత్రి ఇలాంటి వివాదాస్పదంగా మాట్లాడటం అప్ప్రజాస్వామికమన్నారు.ఒకవేళ బీజేపీ నేతలు చెప్పిన వాళ్లకే అవార్డుల ప్రధానం జరిగితే ఈ దేశంలో ద్వంద్వ విధానాలను, విభజన రాజకీయాలను ప్రోస్తహిస్తున్నట్లే అని వారు ఆరోపించారు.
దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు.దేశ స్వాతంత్ర్యం లో బీజేపీ పాత్రే లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాను అవలంభిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి మధు, పి. శివ కుమార్.. కార్యవర్గ సభ్యులు కళ్యాణ్, అనీల్ కుమార్, హేమంత్ కుమార్, అరుణ్, భగత్ సింగ్, వీరేశ్, భాను, భాను ప్రకాష్,సంజయ్, నగేష్, శివ కుమార్,వంశీ,గణేష్, చెట్టుకింద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.