Post Offices : రూ.2500 కోసం పోస్ట్ ఆఫీస్ ల వద్ద బారులు తీరిన మహిళలు.. అసలు నిజం ఏంటి అంటే..!!
ప్రధానాంశాలు:
ఫేక్ ప్రచారాన్ని నమ్మి పోస్ట్ ఆఫీస్ ల వద్దకు మహిళలు క్యూ
Post Offices : రూ.2500 కోసం పోస్ట్ ఆఫీస్ ల వద్ద బారులు తీరిన మహిళలు.. అసలు నిజం ఏంటి ?
Post Offices : తెలంగాణ Telangana Congress Govt కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన “మహాలక్ష్మి పథకం” maha laxmi scheme కింద మహిళలకు నెలకు రూ.2,500 అందజేస్తామన్న హామీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరిగింది. ఈ పథకం కింద వచ్చే నిధులు పోస్టాఫీసు ఖాతాల్లో జమ అవుతాయని వార్తలు ప్రచారం కావడం తో హనుమకొండలోని హెడ్ పోస్టాఫీసు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిపించుకోవడానికి భారీగా క్యూ కట్టారు…
Post Offices : రూ.2500 కోసం పోస్ట్ ఆఫీస్ ల వద్ద బారులు తీరిన మహిళలు.. అసలు నిజం ఏంటి అంటే..!!
Post Offices : రూ.2,500 కోసం పోస్టాఫీసుల వద్ద మహిళల క్యూ..నిజం ఏంటి అంటే !!
పథకాన్ని పొందాలంటే పోస్టాఫీసులో ఖాతా తప్పనిసరి అనే ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మధ్య వేగంగా విస్తరించింది. అయితే ఈ ప్రచారంపై పోస్టాఫీసు అధికారులు స్పందిస్తూ తమకు ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వెల్లడించారు.
అయినా వచ్చిన మహిళలకు ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ప్రచారం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల మధ్య “మహాలక్ష్మి పథకం” హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం నుండి ఎప్పటి నుంచి డబ్బు వస్తుందో, ఖాతా తప్పనిసరిగా పోస్టాఫీసులోనే ఉండాలా అనే సందేహాలు విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన రాకముందే వచ్చిన ఈ ప్రచారం వల్ల మహిళలు గందరగోళానికి గురవుతున్నారు.