AP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు అనంతరం.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడులతో ఏపీ అట్టుడుకుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై ఇలా దాడులు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కాగా, బంద్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారట.
అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తనకు సమాచారం అందలేదని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, అలా చేస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్ షాతో అపాయింట్‌మెంట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీడీపీ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనున్నది అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంపై చర్యలకు పూనుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం 36 గంటల దీక్ష చేయనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్షను టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.