AP: హీటెక్కుతున్న ఏపీ పాలిటిక్స్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. అమిత్ షా వద్దకు పంచాయితీ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP: హీటెక్కుతున్న ఏపీ పాలిటిక్స్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. అమిత్ షా వద్దకు పంచాయితీ..

AP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు అనంతరం.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడులతో ఏపీ అట్టుడుకుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై ఇలా దాడులు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కాగా, బంద్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :21 October 2021,8:20 am

AP: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు అనంతరం.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడులతో ఏపీ అట్టుడుకుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై ఇలా దాడులు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కాగా, బంద్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారట.

Chandrababu

Chandrababu

అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తనకు సమాచారం అందలేదని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, అలా చేస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్ షాతో అపాయింట్‌మెంట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీడీపీ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనున్నది అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంపై చర్యలకు పూనుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

AP: కేంద్రం చర్యలు తీసుకునేనా?

BJP

BJP

బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం 36 గంటల దీక్ష చేయనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్షను టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది