Viral Video : బాబోయ్.. హెలికాప్ట‌ర్ ను ఢీకొట్టిన విమానం.. అందులో ఎవ‌రున్నారో తెలుసా..

Authored By mallesh | The Telugu News | Published on: May 22, 2022, 1:30 pm

Viral Video : విమాన ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు తీవ్ర ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతుంది. ఎంతో మంది గాయ‌ల‌పాల‌వుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది గొప్ప గొప్ప వ్య‌క్తులు విమాన ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించారు కూడా.. నెట్టింట్లో విమాన ప్ర‌మాదాల వీడియోలు కొన్ని వేల్ల‌లో ఉండ‌టం మ‌నం చూస్తుంటాం. విమానాలు ఎలా క్రాష్ అవుతున్నాయో చూసి భ‌య‌ప‌డుతుంటాం. ఎక్కువ‌గా విమానాలు సాంకేతిక లోపాల వ‌ల్ల ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ ల్యాండ్ అవుతుంటాయి. మ‌రికొన్ని ఇత‌ర విమానాల‌తో క్రాష్ అవుతుంటాయి. అంతేకాకుండా విమానంలో పైలెట్ లోపంతో కూడా ప‌లు ప్ర‌మాదాలు జ‌రిగాయి.

baboy the plane that hit the helicopter do you know who was in it

baboy the plane that hit the helicopter do you know who was in it

అయితే ఒక్కోసారి ల్యాండింగ్ ప్రాబ్ల‌మ్ తో కూడా విమానాలు క్రాష్ అవుతుంటాయి. ఒక‌దానితో మ‌రొక‌టి ఢీకొని ధ్వంసం అవుతుంటాయి. విమాన ర‌న్ వేల‌లో కూడా ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. చూస్తుండ‌గానే కొన్ని విమానాలు పేలిపోతుంటాయి. కొన్ని పొలాల్లో ల్యాండింగ్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. దీంతో చాలా మంది విమానాలు ఎక్కాలంటే భ‌య‌ప‌డిపోతుంటారు. మాములుగానే భ‌య‌ప‌డేవారు ఇలాంటివి చూసిన‌ప్పుడు ఇక చ‌స్తే విమానాలు ఎక్కూడ‌దు అని ఫిక్స్ అవుతుంటారు. కాగా చాలా మంది ఈ ప్ర‌మాద‌ వీడియోల‌ను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ప్ర‌స్తుతం ఇలాంటి మ‌రో వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

అయితే కొంత మంది హెలికాప్ట‌ర్ వ‌ద్ద ఉండ‌గా మ‌రో ప‌క్క నుంచి విమానం దారిత‌ప్పి దూసుకొచ్చింది. ఒక్క‌సారిగా హెలికాప్ట‌ర్ ను ఢీకొట్టింది. దీంతో రెండు ముక్క‌ల‌య్యాయి. వెంట‌నే అక్క‌డున్న వారు భ‌యంతో ప‌రుగుతీశారు. హెలికాప్ట‌ర్ ను ప‌రీక్షిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. లేటెందుకు ఈ వీడియో మీరు కూడా చూసేయండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp