Bandla Ganesh : పవన్ పై బండ్ల భక్తి కట్టలు తెంచుకుంటే యూట్యూబ్ నెం.1 గా నిలిచింది
Bandla Ganesh : పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ ఎంతగా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సందర్బంలో కూడా పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. పవన్ ను ఎప్పుడు కూడా తన దేవుడు అంటూ కీర్తిస్తూ ఉండే బండ్ల గణేష్ గతంలో ఎన్నో సార్లు తన స్వామి భక్తిని చాటుకున్నాడు. తాజాగా వకీల్ సాబ్ సినిమా వేడుకలో బండ్ల గణేష్ భక్తి మరింత ఎక్కువ అయ్యింది. బండ్ల గణేష్ దాదాపుగా ఆరు నిమిషాలు మాట్లాడితే ఆ ఆరు నిమిషాలు కూడా మొత్తం పవన్ పై తనకు ఉన్న భక్తిని కనబర్చింది. బండ్ల గణేష్ స్పీచ్ ఎంతగా పవన్ అభిమానులకు నచ్చిందంటే ఆయన స్పీచ్ ను కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ట్రెండ్డింగ్ ల్లో నెం.1 గా నిలిపారు.
Bandla Ganesh : ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా…
బండ్ల స్పీచ్ ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా అంటూ మొదలు పెట్టాడు. శ్రీరాముడికి ఆంజనేయుడు.. శివుడికి భక్త కన్నప్ప.. వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య మాదిరిగా తాను పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిని అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశాడు. ఒకడు నాతో పవన్ కళ్యాణ్ గారికి పొగరు అన్నాడు. అప్పుడు పవన్ పొగరు గురించి బండ్ల గణేష్ చెప్పిన ఉదాహరణలు పవన్ అభిమానులను ఉర్రూతలూగించాయి. పవన్ కళ్యాణ్ ను ఒక హీరోగా కాకుండా దేవుడిగా కొలుస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు బండ్ల బాబు స్పీచ్ కు ఫిదా అవుతున్నారు. తమ మనసులోని విషయాలను బండ్ల గణేష్ చెప్పాడు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh
Bandla Ganesh : పవన్ సినిమాలు చేయడం వల్ల…
పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం వల్ల 1200 కుటుంబాలకు ఉపాది లభిస్తుందని బండ్ల గణేష్ చెప్పాడు. బండ్ల గణేష్ మాట్లాడుతున్నంత సేపు కూడా పవన్ నవ్వుతూనే ఉన్నాడు. దిల్ రాజు పదే పదే పవన్ వైపు చూస్తూ గట్టిగా నవ్వాడు. బండ్ల గణేష్ స్పీచ్ కు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. పవన్ సినిమా వేడుకలో బండ్ల గణేష్ ఇలాంటి స్పీన్ ను అభిమానుల ఊహించారు. కాని బండ్ల గణేష్ వారి ఊహను సైతం మించి ఫన్ క్రియేట్ చేయడంతో పాటు తన స్వామి భక్తిని కనబర్చుతూ నవ్వుల్లో ముంచెత్తేలా చేశాడు.
