Varun Singh.. కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత..
Varun Singh.. మొన్న జరిగిన తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదం విషాద చాయలు ఇంకా అలుముకుంటూనే ఉన్నాయి. ఇందులో ఇండియా తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోగా.. గాయపడి చికిత్స తీసుకుంటున్న కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా కొద్ది గంటల క్రితమే చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ను హుటా హుటిన స్థానిక ఆస్పత్రి నుంచి బెంగళూరులోని హాస్పిటల్‌కు తరలించారు. ఇక అక్కడ వరుణ్ సింగ్ కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించి ఆయన మరణించారు.

captain varun singh died
ఇక ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా తెలిపింది. డిసెంబర్ 8న బిపిన్ రావత్ తన టీమ్ కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో అందులో ఉన్నటువంటి వరుణ్ సింగ్ కూడా గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఇప్పటికే 13 మంది మరణించారు. ఇక వరుణ్ సింగ్ మరణంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.