Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ.. చేపలు అనే సరికి వామ్మో.. అందులో ముళ్లు ఉంటాయి. ఎట్లా తినేది అంటారు. మరికొందరు అయితే చేపలు అంటేనే దూరం పెడతారు. ఈ మధ్య పిల్లలు కూడా చేపలు అంటేనే అస్సలు తినరు. కానీ.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చేపలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
#image_title
మన శరీరానికి ఎంతో మేలు చేసే ఒమోగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లోనే లభిస్తాయి. దానితో పాటు విటమిన్ డీ, బీ2, ఐరన్, అయోడిన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం ఇలా ఎన్నో రకాలా మినరల్స్ చేపల్లో ఉంటాయి. శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం మెరుగుపడాలన్నా చేపలు వారంలో ఒక్కసారైనా తినాల్సిందే. డిప్రెషన్ లో ఉన్నవాళ్లు చేపలను ఎక్కువగా తీసుకుంటే వాళ్ల డిప్రెషన్ తగ్గుతుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. దాని ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.