Nara Lokesh : పీకే ఎంట్రీతో లోకేశ్‌ను దూరం పెడుతున్న చంద్రబాబు.. వారిపై లోకేశ్ గుర్రు?
Nara Lokesh : టీడీపీ భావినేత నారా లోకేశ్ ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని మనస్తాపానికి గురై లోకేశ్ కొద్ది రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Nara Lokesh : కీలక నిర్ణయాల్లో లోకేశ్ దూరం..
ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రస్తుతం విభజిత ఏపీలో ప్రతిపక్షంగా ఉంది. ఈ క్రమంలో పార్టీకి మునుపటి పూర్వ వైభవం తీసుకురావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు కూడా. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి రిస్క్ చేయడానికి ముందుకు రావడం లేదట. సేఫ్ గేమ్ ఆడి పార్టీని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నారని వినికిడి. అందులో భాగంగానే ప్రత్యర్థుల దాడిని ముందే ఊహించి లోకేశ్‌ను కొంత కాలం పాటు పక్కనబెడుతున్నారట. అధికార వైసీపీకి ఈ సారి కూడా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉండబోతున్నారని జగన్ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే పీకే టీం లోకేశ్‌ను టార్గెట్ చేసి టీడీపీని ఇబ్బందులు పెడుతుందని, ఆ నేపథ్యంలోనే లోకేశ్ ను కొంత కాలం పక్కనబెట్టి పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ చీఫ్ ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.
ఈ క్రమంలోనే టీడీపీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో లోకేశ్‌ను సంప్రదించడం లేదట. అయితే, తనను ఏ విషయంలోనూ సలహాలు, సూచనలు తీసుకోవడం లేదని నారా లోకేశ్ పార్టీకి దూరంగా ఉంటున్నారట. టీడీపీలోని సీనియర్ నేతల సజెషన్స్ చంద్రబాబు తీసుకోవడం లోకేశ్‌కు నచ్చడం లేదని టాక్. మొత్తానికి చంద్రబాబు పార్టీ కోసం తనయుడిని కూడా దూరం పెడుతున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. లోకేశ్ సైతం ప్రజెంట్ యాక్టివ్‌నెస్ తగ్గించేశారు. కొద్ది రోజుల కిందటి వరకు పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్.. ఇప్పుడు అంతగా కనబడటం లేదు. ఇకపోతే నారా లోకేశ్ యాత్ర చేయాలని భావించారని అందుకు తొలుత చంద్రబాబు అంగీకరించారని వార్తలు వచ్చాయి. అయితే, ఏమైందో ఏమో తెలియదు కాని నారా లోకేశ్ యాత్ర వద్దని చంద్రబాబు అన్నారట. సీనియర్ నేతల సలహా మేరకు తనను యాత్ర చేయొద్దని చంద్రబాబు అన్నారని నారా లోకేశ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీడీపీలోని సీనియర్ నేతలపై లోకేశ్ గుర్రు మీదున్నారట.