నిహారిక చైతన్యలు అలా.. చిరంజీవి అల్లు అర్జున్ ఇలా.. సంగీత్‌లో రచ్చ రచ్చ వీడియో..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

నిహారిక చైతన్యలు అలా.. చిరంజీవి అల్లు అర్జున్ ఇలా.. సంగీత్‌లో రచ్చ రచ్చ వీడియో..!

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి వేడుకలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజుల వేడుకల్లో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో అది అసంపూర్ణంగా అనిపించింది. అయితే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. దీంతో ఆ పార్టీ సంతృప్తిగా అనిపించింది. మెగా ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన అభిమాలకు ఆ ముచ్చట తీరిపోయింది. ఇక నిన్న, మొన్న రాత్రి జరిగిన సంగీత్ […]

 Authored By uday | The Telugu News | Updated on :9 December 2020,10:27 am

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి వేడుకలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజుల వేడుకల్లో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో అది అసంపూర్ణంగా అనిపించింది. అయితే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. దీంతో ఆ పార్టీ సంతృప్తిగా అనిపించింది. మెగా ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన అభిమాలకు ఆ ముచ్చట తీరిపోయింది.

Chiranjeevi Allu arjun Dance In Niharika Konidela Sangeeth Party

Chiranjeevi Allu arjun Dance In Niharika Konidela Sangeeth Party

ఇక నిన్న, మొన్న రాత్రి జరిగిన సంగీత్ ఈవెంట్‌లో మెగా హీరోలు, కొత్త జంట వేసిన స్టెప్పులు మామూలుగా వైరల్ కాలేదు. నిహారిక చైతన్యలు కలిసి బావగారూ బాగున్నారా సినిమాలోని ఆంటీ కూతురు అనే పాటకు స్టెప్పులు వేశారు. మామూలుగా డ్యాన్స్ వేయడం కాదు ఏకంగా చిరు సిగ్నేచర్ స్టెప్పునే వేశారు. అలా నిహారిక చైతన్యలు దుమ్ములేపారు. ఇక అనంతరం వారితో పాటుగా రామ్ చరణ్ కూడా కాలు కదిపాడు. ఈ మేరకు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ సందడి చేశాయి.

అయితే తాజాగా చిరంజీవి అలా సింపుల్‌గా కాలు కదిపిన మూమెంట్ బయటకు వచ్చింది. చుట్టు అందరూ ఉండగా.. బన్నీ మాత్రం చిరును అంటి పెట్టుకున్నాడు.బంగారు కోడిపెట్ట అనే పాటకు అలా చిరు తనదైన శైలిలో మూమెంట్ ఇచ్చాడు. దీంతో అందరూ అరుపులు కేకలు వేసేశారు. ఆ మూమెంట్‌లో సురేఖను కూడా చిరంజీవి లాగేశారు. మొత్తానికి కొత్త జంట అలా ఎంజాయ్ ఈ జంట ఇలా రచ్చ చేసింది. నేటి రాత్రి నిహారిక చైతన్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది